Bharat TV

24/7 News & Entertaitment

Andhra Pradesh Telangana

చిన్న వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు

భారత్ టీవీ, గుంటూరు ప్రతినిధి: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అన్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు….దేశానికి కూడా తీరని లోటు అని అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని వై.వి. సుబ్బారావు అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకం అని, ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి, ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అని అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని, మీడియా రంగంలో ఆయనొక శిఖరం అని, అనతీకాలంలోనే రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి జర్నలిజం, సినీరంగంతోపాటు దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారన్నారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు అన్నారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *