Bharat TV

24/7 News & Entertaitment

Andhra Pradesh Business Telangana

చిన్న వ్యక్తిగా మొదలైన ప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు….

చిన్న వ్యక్తిగా మొదలైప్రస్థానం.. అతి పెద్ద శక్తిగా ఎదిగిన రామోజీరావు….

రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు రాణించి..

భారతీయ వ్యాపార ప్రముఖుల్లో ఒకరిగా….

భారత్ టీవీ, హైదరాబాద్ ప్రతినిధి: 1936 నవంబర్‌ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. గుడివాడలోనే డిగ్రీ వరకు విద్యాభ్యాసం సాగించారు. ఆ తర్వాత.. 1974 ఆగస్ట్‌ 10న విశాఖ వేదికగా ఈనాడు ప్రారంభించారు. పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త.. సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. 2016లో రామోజీరావుకు పద్మవిభూషణ్‌ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రామోజీరావు మృతిపై దేశంలోని ప్రముఖులంతా సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనీ ప్రముఖులు చిరంజీవి, రజినీకాంత్, జూనియర్ ఎన్డీఆర్ సహా.. టాలివుడ్ ప్రముఖులంతా సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేశారు. అయితే.. రామోజీరావు.. అసలు పేరు చెరుకూరి రామయ్య.. ఆయన మీడియా ప్రపంచంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.. చిన్నపాటి బిజినెస్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదిగారు. ఒక వ్యక్తి నుంచి వ్యవస్థగా మారారు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రామోజీరావు రాణించి.. భారతీయ వ్యాపార ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు.

తెలుగువారి వంటకాల రుచులను రామోజీరావు ప్రపంచానికి పరిచయం చేశారు. 1980 ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్‌ను ప్రారంభించారు. ప్రియా పచ్చళ్లు, స్నాక్స్‌ వినియోగదారుల మనసును దోచుకున్నాయి. అత్యున్నతమైన నాణ్యతతో వందల రకాల ఉత్పత్తులను ప్రియా ఫుడ్స్‌ ద్వారా తీసుకొచ్చి, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు సరఫరా చేశారు. ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రియా ఫుడ్స్‌కు అనేక రాష్ట్ర, జాతీయ పురస్కారాలు లభించాయి. ఒకప్పుడు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీ, అనతీకాలంలోనే రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి జర్నలిజం, సినీరంగంతోపాటు దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమై ఎంతోమంది నటులు, అగ్రశ్రేణి తారలుగా ఎదిగారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు. ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెరపై అద్భుతాలు సృష్టించారు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీ ప్రారంభించారు. సీరియల్స్ ద్వారా వేలమంది నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు. తక్కువ సమయంలోనే జాతీయస్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీ విస్తరించింది. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు.

సినీ, టీవీ రంగాల్లో రామోజీరావు చెరగని ముద్ర వేశారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌పై పలు సినిమాలు, టీవీ సీరియళ్లు నిర్మించారు. శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌనపోరాటం, ప్రతిఘటన, పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌, అశ్వని, చిత్రం, మెకానిక్‌ మామయ్య..ఇష్టం, నువ్వేకావాలి, ఆనందం, ఆకాశవీధిలో వంటి సినిమాలను నిర్మించారు. మూడుముక్కలాట, నిన్నుచూడాలని, తుఝె మేరీ కసమ్, వీధి, నచ్చావులే, నిన్ను కలిశాక.. సినిమాలు నిర్మించిన ఆయన.. ఆ రంగానికి విశేషమైన సేవలందించారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *