Bharat TV

24/7 News & Entertaitment

General

అశ్వవాహనంపై శ్రీ వేణుగోపాలుడి కటాక్షం

తిరుప‌తి, 2024 జూన్ 05: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన‌ బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను కటాక్షించారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహన సేవ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *