Bharat TV

24/7 News & Entertaitment

Andhra Pradesh Devotional International

వైభ‌వంగా శ్రీ వేణుగోపాల‌స్వామివారి చక్రస్నానం

తిరుపతి, 2024 జూన్ 06: కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం వైభ‌వంగా నిర్వ‌హించారు.

ఉద‌యం 8 నుండి 9.15 గంటల వ‌ర‌కు ఆలయ స‌మీపంలోని స్కంధ పుష్క‌రిణిలో అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.


ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూప‌రింటెండెంట్ సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *