Bharat TV

24/7 News & Entertaitment

Andhra Pradesh Education

ఆంధ్రప్రదేశ్ ఎన్ సీ సీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు 

భారత్ టీవీ, అమరావతి ప్రతినిధి:ఆంధ్ర, తెలంగాణా ఎన్.సి.సి డైరక్టరేట్ డిప్యూటీ డైరెక్టరేట్ జనరల్, ఎయిర్ కమాండర్ విఎమ్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించారు. నిన్న జిల్లాలోని నంబూరులో గల వివిఐటి కళాశాల లోని 10 వ బెటాలియన్ బాలికల వార్షిక శిబిరాన్ని ఆయన సందర్శించిన ఆయన, ఈ రోజు గుంటూరు లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 70 యూనిట్ల ద్వారా శిబిరాలు నిర్వహిస్తున్నామని, త్వరలో ప్రతి జిల్లాలోనూ శిబిరాలు ఏర్పాటుచేయబోతున్నామని తెలిపారు. ఈ జిల్లా స్ధాయి శిబిరాలలో ప్రతిభ కనబరచిన కేడెట్లు ఢిల్లీలో నిర్వహించే తలసైనిక్ క్యాంపుకు ఎంపిక కాబడతారని ఆయన వివరించారు. ఈ సంవత్సరం నుండి వార్షిక శిక్షణ శిబిరంలలో సాహసవిన్యాసాలు, రాక్ క్లైమింగ్, ట్రెక్కింగ్, కైయాకింగ్ కూడా ప్రవేశ పెట్టామని తద్వారా కెడెట్లు పూర్తిస్థాయి ప్రావిణ్యం పొందగలుగుతారని కమాండర్ వి.ఎమ్.రెడ్డి తెలిపారు. కేంద్రప్రభుత్వం మొదటిదశలో 26వేల ఎన్.సి.సి పోస్టుల భర్తీకి అనుమతి తెలిపిందని వివరించారు. కార్యక్రమంలో భాగంగా శిబిరంలో ప్రతిభ కనబరచిన కెడెట్లకు పురస్కారాలు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ క్యాడెట్ కార్ప్‌స్ – ఎన్ సీ సీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్ సీసీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.మధుసూదన్ రెడ్డి చెప్పారు. గురువారం గుంటూరులో ఎన్సీసీ వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విశాఖలలో ఎన్సీసీ గ్రూప్లు ఉన్నాయన్నారు. ఎన్సీసీ శిక్షణతో విద్యార్థులకు సమాజం , దేశంపై బాధ్యత, గౌరవం పెరుగుతాయని, క్రమ శిక్షణ కలిగిన పౌరులుగా ఎదుగుతారని పేర్కొ న్నారు. ఎన్సీసీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎన్సీసీ గ్రూప్లను విస్తరించి, మరింత విసృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *